సుష్మ మరణం నేపథ్యంలో.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రెస్ మీట్ రద్దు

  • సుష్మ ప్రాణాలు కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యుల విశ్వ ప్రయత్నం 
  • నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన సుష్మాస్వరాజ్
  • శోకసంద్రంలో మునిగిపోయిన బీజేపీ
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ నిన్న రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఈ నేపథ్యంలో, బీజేపీ నేతలు, కార్యకర్తలు, సుష్మ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణం నేపథ్యంలో, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తాను ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రెస్ మీట్ ను రద్దు చేసుకున్నారు. నిన్న రాత్రి 9.30 గంటల ప్రాంతంతో సుష్మాస్వరాజ్ తుదిశ్వాస విడిచారు. ఆమెను బతికించేందుకు ఎయిమ్స్ వైద్యులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దాదాపు 80 నిమిషాల సేపు అత్యవసర చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.  
Go Back to Shorts
Om Birla
Lok Sabha
Sushma Swaraj

More Telugu News